కృష్ణ జింకల కేసు.. సల్మాన్​ పై బిష్ణోయ్​ వర్గం కక్ష

క్షమాపణ కోరాలంటున్న పలువురు నేతలు

Oct 15, 2024 - 22:51
 0
కృష్ణ జింకల కేసు.. సల్మాన్​ పై బిష్ణోయ్​ వర్గం కక్ష

ముంబాయి: బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​ పై బిష్ణోయ్​ కమ్యూనిటీ ఎందుకు కక్ష గట్టింది. ఈ సమాజం కృష్ణ జింకలను అత్యంత పవిత్రంగా భావిస్తుంది. కృష్ణ జింకలను చంపిన కేసులో ఈ హీరో ప్రధాన నిందితుడిగా ఉండడమ ఈ వర్గానికి కోపం తెప్పించింది. బిష్ణోయ్​ కమ్యూనిటీ కృష్ణ జింకలను పూజించడంలో 550 యేళ్ల చరిత్ర ఉన్నట్లుగా పేర్కొంటారు. అలాంటి జింకలను రెండింటిని సల్మాన్​ ఖాన్​ చంపిన ఉదంతంతో ఈ వర్గం ఆయనై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్దిఖీ హత్య కూడా జరిగిందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ హత్యలపై ఇప్పటికైనా బిష్ణోయ్​ సమాజానికి సల్మాన్​ ఖాన్​ క్షమాపణలు చెబితే వివాదం సద్దుమణిగే అవకాశం ఉందని పలువురు సూచించారు. కానీ సల్మాన్​ వీరి వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈ వ్యాఖ్యలు, కృష్ణ జింకల హత్య వార్త కాస్త సోషల్​ మీడియాలో బాగా ట్రెండ్​ అవుతోంది.