1621 కేసుల రాజీ.. జిల్లాకు తృతీయ స్థానం

సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

Sep 30, 2024 - 19:31
 0
1621 కేసుల రాజీ.. జిల్లాకు తృతీయ స్థానం
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1621 కేసులు రాజీ కుదిరాయని జిల్లాకు తృతీయ స్థానం లభించిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్​ తెలిపారు. సోమవారం ఎస్పీ రూపేష్​ మీడియాకు వివరాలందించారు. 570 ఐపీసీ, 140 - సైబర్ క్రైమ్, ఈ–-పెట్టి -911 కేసులున్నాయన్నారు. 
 
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన డబ్బు రూ. 1.91 కోట్ల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేశామన్నారు. జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని  జిల్లా ఎస్పీ  అభినందించారు. సెప్టెంబర్ 14  నుంచి 18 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ ను పురస్కరించుకొని, జిల్లా వ్యాప్తంగా రాజీ పడేందుకు అవకాశం ఉన్న చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, 1621 కేసులలో ఇరు వర్గాలు రాజీ పడ్డారని తెలిపారు. లోక్-అదాలత్ లో భాగంగా సైబర్ క్రైమ్ రీఫండ్ క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని తెలిపారు. గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. 
 
సైబర్​ కేసుల్లో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్  శిఖాగోయల్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సైబర్​ నేరాలకు గురైతే 1930కి కాల్​ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు.