నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని రెవెన్యూ, మున్సిపల్ పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవోలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వార్త వరద వచ్చే అవకాశం ఉన్న వాగులు కాలువల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నారాయణఖేడ్ , జహీరాబాద్, ఝారాసంఘం, రాయికోడ్ ప్రాంతాలలో వాగులు వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా మండలాల తహశీల్దారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాలలో వర్షాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చెరువులు కుంటలు నిండి అలుగులు పారే అవకాశం ఉన్నందున నూతన ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఆర్డీవోలు, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోలు వర్షా లు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తతో ఉండాలని సూచించారు.