నా తెలంగాణ, పాపన్నపేట: ప్రజల్లో బీజేపీ పట్ల విశేష ఆదరణ ఉందని, ప్రతి బూత్ లోనూ కనీసం 200 మందిని సభ్యులుగా చేర్పించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయికుమార్ అన్నారు. బుధవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం నియోజకవర్గంలోని పాపన్నపేటలో ఇంటింటా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో పర్యటించి సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలోనే పాపన్నపేట మండలంలో మొదటి స్థానంలో ఉండేవిధంగా పాటుపడాలని ఆయన సూచించారు.