డీజే వినియోగంపై నిషేధం కలెక్టర్ అభిలాష అభినవ్

Collector Abhilash Abhinav bans use of DJ

Oct 3, 2024 - 21:21
 0
డీజే వినియోగంపై నిషేధం కలెక్టర్ అభిలాష అభినవ్

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా పరిధిలో మత పరమైన ఊరేగింపుల్లో డీజే  వినియోగంపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జి.జానకి షర్మిల గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బ తింటుందనే కారణంతో జిల్లాలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే పోలీసు యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తున్న సమస్యలను విశ్లేషించి అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.