కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు

Key decisions of the central cabinet

Oct 3, 2024 - 21:16
 0
కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు
రైతుల ఆర్థికస్థితి పెరుగుదల
మధ్యతరగతి ఆహార భద్రతకు పెద్దపీట
పీఎంఆర్​కెవీవై, పీఎంకేవై కింద రూ. 1,01,321 కోట్లు కేటాయింపు
రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్​
12 లక్షల మందికి లబ్ధి
కేంద్ర ప్రభుత్వంపై రూ. 2029 కోట్ల అదనపు భారం
చెన్నై మెట్రో ఫేజ్​–2కు ఆమోదం
రూ. 63,246 కోట్ల కేటాయింపు
శాస్త్రీయ భాషలో మరో ఐదు భాషలు చేర్చాలని నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం సాయంత్రం జరిగిన కేబినెట్​ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయం పెంపుదల, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిపుష్టి, ఆహార భద్రతలకు పెద్దపీట వేశారు. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృష్ణోన్నతి యోజన కింద రూ.1,01,321 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్​ ను ఈ రెండు పథకాల ద్వారా మరో 18 పథకాలకు కేటాయించనున్నారు. దీంతోపాటు చెన్నై మెట్రో–2 ఫేజ్​ కు రూ. 63,246 కోట్లకు ఆమోదం తెలిపారు. 
 
కేబినెట్​ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ మీడియాకు వివరించారు.  రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్​ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండోదశ చెన్నై మెట్రోలో 119 కిలోమీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. 120 స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు. 2031 నాటికి ఎడిబుల్ ఆయిల్స్ ఉత్పత్తిని 1.27 కోట్ల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.10,103 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 లక్షల రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్​ ను ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.2029 కోట్ల అదనపు భారం పడనుంది. రైల్వేలో 58,642 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇది కాకుండా మూడు కొత్త రైల్వే కారిడార్లకు ఆమోదం తెలిపారు. భారత్ ఎనర్జీ ఎఫిషియెన్సీ హబ్‌లో సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించారు. శాస్త్రీయ భాషలో మరో ఐదు భాషలు చేర్చాలని నిర్ణయించారు. మరాఠీ పాలీ, ప్రాకృత అస్సామీ, బెంగాలీ ఉన్నాయి. దీంతో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయి. దీంతో ఈ భాషా ప్రావీణ్యులకు ఉద్యోగభద్రత లభించనుంది.