మాల్దీవులకు భారీగా తగ్గిన పర్యాటకులు

మొయిజ్జు నోటీదురుసుపై భారతీయుల గుర్రు

Apr 12, 2024 - 13:42
 0
మాల్దీవులకు భారీగా తగ్గిన పర్యాటకులు

న్యూఢిల్లీ: మాల్దీవులకు భారత పర్యాటకులు భారీగా తగ్గారు. ఈ యేడాది కేవలం 16 వేల మంది మాత్రమే దేశం నుంచి అక్కడికి పర్యటనకు వెళ్లారు. ఈ సంఖ్య గతంలో చాలా ఎక్కువగా ఉండేది. భారత్​ తో మాల్దీవులు వివాదం తరువాత ఆ దేశం పలుమార్లు నోరు పారేసుకుంది. తద్ఫలితాన్ని కూడా అనుభవిస్తోంది. నిన్న మొన్నటి వరకూ చైనాతో చెట్టాపట్టాలేసుకున్నా, చైనా ‘ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే’ రకమని గుర్తెరిగినట్లుంది. దీంతో భారత్​ తో మరోమారు సఖ్యత కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కాగా మొయిజ్జు వ్యాఖ్యలపై ఆ దేశ ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత్​ లాంటి మంచి మిత్ర దేశాన్ని కోల్పోవడం దేశ భవిష్యత్తును కోల్పోవడంతో సమానమని పేర్కొన్నాయి. ఆది నుంచి శాంతికాముక దేశంగా భారత్​ ఉందని, వారితో స్నేహ హస్తంతో అనేక సార్లు ఆపత్కాలంలో ఆదుకున్న విషయాలను కూడా ఊటంకించారు. 

తగుదునమ్మా అన్నట్లుగా మొయిజ్జు ఇటీవల కొద్ది రోజుల క్రితమే ప్రకటన చేస్తూ భారత సైనికులు ఏ ఒక్కరు ఉండేందుకు వీలు లేదని, లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్​ కూడా తాను చేయాల్సిందంతా చేస్తోంది. భారత్​ కీర్తి, ప్రతిష్ఠతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన దేశానికి భారత్​ ప్రజలు కూడా తగిన రీతిలో సమాధానం చెబుతున్నారు.

2023లో భారతీయులు ఏ దేశాలకు ఎంతమంది వెళ్లారనే డేటా ఓసారి చూద్దాం..

మాల్దీవులు 2,10,198
రష్​యా 2,09,146
చైనా 1,87,118
యూకే 1,55,730
జర్మనీ 1,35,090
ఇటలీ 1,18,412
యూఎస్​ 74,575
ఫ్​రాన్స్​ 49,199
స్పెయిన్​ 40,462