మోదీ ఓటమి తప్పదన్న పాక్ మంత్రి తీవ్రంగా తిట్టిపోస్తున్న నెటజన్లు
పగటి కలలు కంటున్నారా? వ్యాఖ్యలు మంటలు చల్లార్చుకుంటున్నారు భారత్ లో 3 శాతం నుంచి 25 శాతానికి ముస్లింలు పాక్ లో 30 శాతం నుంచి 3 శాతానికి హిందువులు ద్వేషభావం ఎవరితో తేల్చాలని విమర్శలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ముస్లింపట్ల భారత్ ద్వేషభావంతో ఉందని పాక్ మంత్రి ఫహాద్ హుస్సేన్ చౌదరి అన్నారు. ఆయన మీడియాతో బుధవారం మరోమారు మాట్లాడుతూ మోదీపై విమర్శలు చేశారు. ఇండి కూటమి పార్టీలు గెలుస్తాయని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యల నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మీ దేశంలో పరిస్థితులు ముందుగా చూసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. తిండికి కూడా ఆపసోపాలు పడే పాక్ ఎక్కడో, అన్ని సౌకర్యాలు అందుతున్న, అభివృద్ధి చెందుతున్న భారత్ ఎక్కడో ఓసారి చూసుకోవాలని అంటున్నారు.
భారత అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచదేశాల్లో కీర్తి ప్రఖ్యాతులు పెంచుకుంటుంటే పాక్ అభిమానుల్లో మంటలు చెలరేగుతున్నాయి. భారత వ్యతిరేక శక్తులతో కలిసి పదే పదే మోదీ ఓడిపోతున్నారని, ఓడిపోవాలని పగటి కలలు కంటూ తమలో తామే ప్రకటించుకుంటూ స్వాంతన చేకూర్చుకుంటున్నారు. మరోవైపు ‘అదిగో నక్క అంటే ఇదిగో పులి’ అంటూ భారత వ్యతిరేక శక్తులు కూడా వారికి వంత పాడుతున్నాయి.
ముచ్చటగా మూడోసారి మోదీ హ్యాట్రిక్ ఖాయమవడంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ తమలోని మంటలను కొద్దిరోజులపాటు చల్లార్చుకుంటున్నారని భారత్ లోని మోదీ అభిమానులు తిట్టిపోస్తున్నారు. పాక్ మంత్రి మోదీ ఓడిపోవాలని కోరుకున్నంత మాత్రాన వారు అనుకున్న అభీష్టం ఎన్నటికీ నెరవేరదని అంటున్నారు.
దీనికి పలువురు ప్రతిపక్ష పార్టీలు కూడా వంతపాడటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. మూడు శాతం ఉన్న ముస్లింలు కాస్త 25 శాతానికి భారత్ లో చేరుకుంటే, పాక్ లో ఉన్న 30 శాతం హిందువులు 3 శాతానికి చేరుకుంటే ఎవరిలో ద్వేష భావం ఉన్నదో విపక్ష పార్టీలే చెప్పాలి. ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా వ్యాఖ్యానిస్తున్న వారికి అసలు భారత్ పై ఏ మాత్రం అభిమానం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.