బలూచ్​ లోయలో పడ్డ బస్సు 28మంది దుర్మరణం

22మందికి తీవ్ర గాయాలు టైరు పేలడంతో ప్రమాదం

May 29, 2024 - 16:57
 0
బలూచ్​ లోయలో పడ్డ బస్సు 28మంది దుర్మరణం

ఇస్లామాబాద్​: పాక్​ లోని బలూచ్​ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోవడంతో చిన్నారులు, మహిళలు సహా 28 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్వెట్టా వాషుక్​ నగరంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. పాక్​ లో ఇరుకైన రహదారులు, అత్యధిక ప్రయాణికులు, వాహనాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పలు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని బసిమా సివిల్​ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.