కేసుల సంఖ్య తగ్గించడమే పెద్ద సవాల్
సుప్రీం సేవలు అభినందనీయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: న్యాయవ్యవస్థకు కేసుల సంఖ్య తగ్గించడం పెద్ద సవాల్ గా మారిందని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. ఆదివారం భారత మండపంలో నిర్వహిస్తున్న జిల్లా న్యాయవ్యవస్థ రెండు రోజుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. కేసుల సంఖ్యను తగ్గించేందుకు అందరూ కలిసి ప్రయత్నించాలన్నారు. సుప్రీంకోర్టు 75 యేళ్ల ప్రయాణం హర్షణీయమన్నారు. పౌరులకు అత్యున్నత కోర్టు సేవలు అభినందనీయమన్నారు.
అనంతరం సీజీవై డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. కేసుల సంఖ్యను తగ్గించేందుకు కమిటీ ప్రణాళికలను రూపొందించిందన్నారు. కేసుల సంఖ్య తగ్గించేందుకు జాతీయ లోక్ అదాలత్ కూడా ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో గణనీయంగా కేసులకు సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తున్నామని చంద్రచూడ్ తెలిపారు.