మితిమీరుతున్న చైనా ఆగడాలు ఫిలిప్పీన్స్ నౌకలపై దాడులు
Attacks on Philippine ships due to China's excessive aggression
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: చైనా ఆగడాలు మితమీరుతున్నాయి. ఫిలిప్పీన్స్ దళాలపై దాడులు చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఫిలిప్పీన్స్ దళాల కోస్ట్ గార్డ్ బలగాలపై చైనా కత్తులు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడింది. ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిలిప్పీన్స్ అధికారులు ఈ గొడవపై స్పందిస్తూ నౌకాదళానికి ఆహారం తీసుకొని వెళుతున్న రెండు బోట్లపై చైనా దళాలు దాడి చేశాయన్నారు. బోట్లోని ఎం–4 రైఫిళ్లని ఎత్తుకొని వెళ్లారన్నారు. నేవిగేషన్ పరికరాలను సీజ్ చేశారన్నారు. ఈ దాడిలో ఫిలిప్పీన్స్ సైనికులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. చైనా దళాలు ఆయుధాలతో ఉన్నా తమ సైనికులు ఒత్త చేతులతో వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. ఈ ఘటనపై చైనా స్పందిస్తూ పడవలో అక్రమ ఆయుధాలు సరఫరా అవుతున్నాయని అందుకే వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భారత్ సహా తైవాన్, ఫిలిప్పిన్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాల సముద్ర తీరాలు, సరిహద్దు ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ చైనా పలు దేశాలను భయపెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే.