కుప్వార్​ లో కాల్పులు ఒక జవాను వీరమరణం

నలుగురికి గాయాలు ఒక ఉగ్రవాది హతం?

Jul 27, 2024 - 12:31
 0
కుప్వార్​ లో కాల్పులు ఒక జవాను వీరమరణం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లోని కుప్వారాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందగా, నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. శనివారం ఉదయం కుప్వారాలోని మచిల్​ సెక్టార్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సెర్చింగ్​ ఆపరేషన్​ చేపట్టగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో ఉగ్రవాదులతోపాటు పాక్​ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరితోపాటు ఎస్​ ఎస్​ జీ కమాండోలు, పాక్​ ఆర్మీ కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుప్వారాలోని మచిల్​ సెక్టార్​ కమ్కారీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ కు దిగగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.

అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ ను చేపట్టాయి.