గ్రాడ్యుయేషన్​ కోర్సులో మార్పులు?!

యూజీసీ కమిషన్​ భేటీలో కీలక నిర్ణయాలు త్వరలోనే నిర్ణయాలకు ఆమోదం

Nov 15, 2024 - 18:04
 0
గ్రాడ్యుయేషన్​ కోర్సులో మార్పులు?!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూజీసీ 2025–26 విద్యాసంవత్సరం నుంచి గ్రాడ్యుయేషన్​ కోర్సు వ్యవధి తగ్గింపు, పెరుగుదల నిర్ణయాన్ని విద్యార్థులకే వదిలేయనుంది. దీనిపై యూజీసీ గ్రాంట్స్​ కమిషన్​ చైర్మన్​ ఎం. జగదీశ్​ కుమార్​ వివరాలను వెల్లడించారు. ఐఐటీ మద్రాస్​ డైరెక్టర్​ సూచించిన విధానంపై కమిషన్​ సభ్యులను ఆకర్షించింది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ విధానం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు సౌలభ్యంగా, సౌకర్యవంతంగా ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఈ విధానం ప్రకారం గ్రాడ్యుయేషన్​ డిగ్రీని ఐదు సంవత్సరాలకు పొడిగించే, 2.5 సంవత్సరాల వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు గ్రాడ్యుయేషన్​ విద్యకు నాలుగేళ్లు సమయం పట్టేది. దీంతో పలువురు విద్యార్థులు ఖచ్చితంగా నాలుగేళ్ల వరకూ చదవాల్సి వచ్చేది. అదే సమయంలో నాలుగేళ్ల సమయంలో నిరుపేద విద్యార్థులకు ఏవైనా అవాంతరాలు ఎదురైతే మధ్యలో సమయం వెచ్చించాల్సి ఉండడంతో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇక గ్రాడ్యుయేషన్​ సిలబస్​ ను త్వరగా పూర్తిచేసే విద్యార్థులకు కూడా సమయం 2.5 సంవత్సరాలకు తగ్గించడంతో వారికి సౌలభ్యంగా ఉండనుంది.