లాటరీ కింగ్​ కార్యాలయాలపై దాడులు

రూ. 8.8 కోట్లు స్వాధీనం

Nov 15, 2024 - 17:45
 0
లాటరీ కింగ్​ కార్యాలయాలపై దాడులు

చెన్నై: చెన్నైలోని శాంటియాగో మార్టిన్​ (లాటరీ కింగ్​) కార్యాలయాలపై ఈడీ చేసిన దాడుల్లో రూ. 8.8 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని అధికారులు మీడియాకు వివరించారు. ఎలక్టోరల్​ బాండ్​ ల ద్వారా రూ. 1300 కోట్లకు పైగా నిధులను సమీకరించుకొని పలు రాజకీయ పార్టీలకు తరలించినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. మద్రాస్​ హైకోర్టు ఇటీవలే సోదాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో ఈడీ మార్టిన్​ కు చెందిన వివిధ రాష్​ర్టాల్లోని కార్యాలయాలపై ఏకకాలంలో శుక్రవారం సోదాలకు దిగింది. రూ. 8.8 కోట్ల నగదు లభించినా, ఇందులో లెక్కల్లో చూపని నగదు రూ. 7.2 కోట్లుగా అధికారులు తెలిపారు. సోదాల్లో భాగంగా మార్చిన్​, అల్లుడు ఆధవ్​ అర్జున్​, సహచరులకు చెందిన 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. చెన్నై, కోయంబత్తూరు, హరియాణా, ఫరీదాబాద్​, లూథియానా, పశ్చిమ బెంగాల్​ లోనూ సోదాలు కొనసాగాయి. కేరళలో సిక్కిం రాష్​ర్టం పేరిట లాటరీల లావాదేవీలలో రూ. 900 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫెడరల్​ ఏజెన్సీ గుర్తించింది. దీంతో రూ. 457 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. శాంటియాగో మార్టిన్​ కు తమిళనాడులో లాటరీ కింగ్​ గా పేరుంది. అదే సమయంలో దేశంలో అనైతిక కార్యకలాపాలకు ఇతని ద్వారా నగదు అందుతున్నట్లు కూడా ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి.