ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు

Jun 12, 2024 - 12:51
 0
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

విజయవాడ: ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడ గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కులో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. గవర్నర్​ అబ్దుల్​ నజీర్​ చంద్రబాబునాయుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, జి.కిషన్​ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, రామ్‌ చరణ్‌ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మంత్రుల ప్రమాణ స్వీకారం..

చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి,  గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు.