నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
Four Bangladeshis arrested
ముంబై: నలుగురు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్లోకి చొరబడడమే గాకుండా ఇక్కడ అన్ని పత్రాలు సృష్టించుకొని ఏకంగా ఓట్లు కూడా వేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నాయి. మంగళవారం ముంబైలో పట్టుకున్న నలుగురిని ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఈ నలుగురితోపాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధంగా వీరు భారత పౌరులుగా మారేందుకు పలు పత్రాలను పొందారు. అరెస్టు అయిన వారిలో రియాస్ హుస్సేన్, సుల్తాన్ సిద్దిఖీ, ఇబ్రహీం షఫీవుల్లా, ఫరూక్ లను అరెస్టు చేశారు. కోర్టు వీరికి జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.