రెండు హెలికాప్టర్లు ఢీ  10 మంది మృతి

మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది సిబ్బంది మరణించారు.

Apr 23, 2024 - 13:57
 0
రెండు హెలికాప్టర్లు ఢీ  10 మంది మృతి

కౌలలంపూర్​: మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం మంగళశారం ఉదయం చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్‌లోని రోటర్ (ఫ్యాన్) మరొక హెలికాప్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. రెండూ హెలికాప్టర్లు స్టేడియం గ్రౌండ్‌లోనే పడిపోయాయి. ఈ హెలికాప్టర్లు రాయల్ మలేషియా నేవీకి సంబంధించిన ఒక ఫంక్షన్ కోసం సిద్ధమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లుముట్ నేవల్ బేస్ వద్ద ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత, మరణించిన వారందరి మృతదేహాలను లుముట్ ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వారి గుర్తింపు అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.