మహారాష్ట్రలో భారీ వర్షాలకు ఇద్దరు మృతి

పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​

Jun 12, 2024 - 13:03
 0
మహారాష్ట్రలో భారీ వర్షాలకు ఇద్దరు మృతి

ముంబై: మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. కాగా 12 రాష్ట్రాలకు వాతావరణ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల రాకతో మహారాష్ర్ట, గుజరాత్​, తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

కాగా మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎండలతో ఉపశమనం లభించినా ఒక్కసారిగా పడ్డ భారీ వర్షాల వల్ల థానేలోని అహ్మద్​ నగర్​ ఘాట్​ వద్ద కొండచరియలు ఆటోపై విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో రాహుల్​ బాబాన్​, సచి భలేరావ్​ లు మృతిచెందినట్లుగా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలోని అసర్​ ఖేడ్​, నాసిక్​ జిల్లా, లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల ధాటికి పలు చోట్ల చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్​ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్​, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తేలికపాటి వర్షాలు కురిశాయి.