ప్రముఖుల ఓట్లు–2.. ఓటింగ్​ శాతం

సోమవారం జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్​ లో పోలింగ్​ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ర్టలో పోలింగ్​ శాతం నమోదైంది.

May 13, 2024 - 10:07
 0
ప్రముఖుల ఓట్లు–2.. ఓటింగ్​ శాతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సోమవారం జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్​ లో పోలింగ్​ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ర్టలో పోలింగ్​ శాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ 9.05 శాతం, బీహార్ 10.18, జమ్మూ కాశ్మీర్ 5.07, జార్ఖండ్ 11.78, మధ్యప్రదేశ్ 14.97, మహారాష్ట్ర 6.45, ఒడిశా 9.23, తెలంగాణ 9.51, ఉత్తర ప్రదేశ్ 11.67, పశ్చిమ బెంగాల్ 15.24 శాతం పోలింగ్​ నమోదైంది.

ప్రముఖుల ఓట్లు..

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పోలింగ్ బూత్ నంబర్ 9లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బయటకు వచ్చి ఓటు వేసి దేశాన్ని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, మీ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలన్నారు. 

నబరంగ్‌పూర్ బీజేడీ ఎంపీ రమేశ్ చంద్ర మాఝీ, ఝరిగం ఎమ్మెల్యే ప్రకాశ్ చంద్ర మాఝీ ఓటు వేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి, పిలిభిత్ బీజేపీ అభ్యర్థి జితిన్ ప్రసాద్ ఓటు వేశారు.

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా  ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలను లాక్కెళ్లారని ఆరోపించారు. 

మహారాష్ర్ట మంత్రి చంద్రకాంత్​ పాటిల్​ ఓటు వేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్​ కళ్యాణ్​ పిఠాపురం లోక్​ సభ స్థానంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఓటు వేశారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పోలింగ్ బూత్ నరుమల్ గగందాస్ జెత్వాని సింధీ ధర్మశాల, ఫ్రీ గంజ్, బూత్ నంబర్ 60లో ఓటు వేశారు.