మాధవి రాజే కన్నుమూత
గురువారం గ్వాలియర్ లో అంత్యక్రియలు
నా తెలంగాణ ఢిల్లీ: కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తల్లి రాజమాత మాధవి రాజే సింధియా (75) కన్నుమూశారు. గత రెండు నెలలుగా ఆమె అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. మాధవి రాజే భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఢిల్లీలోని నివాసంలో ఉంచనున్నారు. అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు గ్వాలియర్‌లో నిర్వహించనున్నారు. మాధవి రాజే మృతి పట్ల సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, మాజీ సీఎం కమల్ నాథ్ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
రాజమాత మాధవి రాజే నేపాల్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమె తాత జడ్ షంషేర్ బహదూర్ నేపాల్ ప్రధాన మంత్రి. ఆయనే రాణా వంశానికి అధిపతి కూడా. ఆమెకు 1966లో మాధవరావు సింధియాతో వివాహం జరిగింది.