భారత్​ ను హిందు దేశంగా ఎందుకు ప్రకటించలేదు

మొఘలులు, బ్రిటిష్​, కాంగ్రెస్​ దుష్టపాలనతో ప్రజలు విసిగిపోయారు బీజేపీ అభ్యర్థి కంగనా రౌనత్​

May 13, 2024 - 10:31
 0
భారత్​ ను హిందు దేశంగా ఎందుకు ప్రకటించలేదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ విభజన సమయంలో ఇస్లామిక్​ దేశంగా పాక్​ ను విభజించినప్పుడు హిందూ దేశంగా భారత్​ ను ఎందుకు విభజించలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ సినీనటి కంగనా రౌనత్​ ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మొఘలులు, బ్రిటిష్​, కాంగ్రెస్​ దుష్టపాలనతో హిందువులు విసిగి వేసారిపోయారని మండిపడ్డారు. ప్రధాని మోదీ యుగపురుషుడని కొనియాడారు. ఆలోచనా, సనాతన, సొంత మతాన్ని సృష్టించుకునే స్వేచ్ఛ హిందువులకు లేదా? అని ప్రవ్నించారు. పాక్​ ను ఇస్లామిక్​ దేశంగా పరిగణించినప్పుడు, విభజించినప్పుడు భారత్​ ను ఎందుకు హిందూ దేశంగా మార్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పరిణామాలన్నీ గమనిస్తే భారత్​ కు నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చినట్లుగా లేదని 2014లో వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. కాగా రౌనత్​ ప్రకటనపై పెద్ద దుమారమే రేగుతోంది.