బడ్జెట్​ లో మధ్యతరగతికి ఊరట

ఆదాయపు పన్ను తగ్గింపు యోచన

Jun 20, 2024 - 14:11
 0
బడ్జెట్​ లో మధ్యతరగతికి ఊరట

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రం విడుదల చేయనున్న 2024–25 బడ్జెట్​ లో మధ్యతరగతి వర్గాలకు భారీ ఉపశమనం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకూ ప్రతీయేటా సంపాదించే వారికి ఆదాయపు పన్నులో భారీ రాయితీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏ మేరకు ఆదాయపు పన్నులో రాయితీ కల్పించనుందో తెలియదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 5 లక్షల వరకు ఆదాయపు పన్నుపై మినహాయింపు ఉంది. బుధవారం జరిగిన కేబినెట్​ భేటీలో మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించే నిర్ణయంపై కూడా చర్చలు కొనసాగినట్లు సమాచారం.