పాక్ లో ఇరు వర్గాల దాడులు 16 మంది మృతి
16 people were killed in attacks by both factions in Pakistan
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతం ఖైబర్ ఫంఖ్తున్ ఖ్వా కుర్రం జిల్లాలో సున్నీ, షియా తెగలకు మధ్య జరిగిన దాడుల్లో 16 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఇరుతెగలకు మధ్య ఘర్షణలు, రక్తపాతాలు చోటు చేసుకుంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, పారామిలటరీ దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. పలుమార్లు రెండు వర్గాల మధ్య ప్రభుత్వం రాజీ కుదుర్చే ప్రయత్నాలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాంతంలో రక్తపాతాలు సర్వసాధారణంగా మారిపోయాయి. పాక్ సున్నీల ప్రాబల్యం ఉన్న దేశం కావడంతో ఇక్కడ ఉన్న షియా వర్గాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి.