పాక్​ మాజీ మంత్రికి సీఎం కేజ్రీవాల్​ చురకలు

మీ దేశ పరిస్థితులు చూసుకోవాలన్న సీఎం

May 25, 2024 - 13:27
 0
పాక్​ మాజీ మంత్రికి సీఎం కేజ్రీవాల్​ చురకలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఆప్​ అధినేత, సీఎం కేజ్రీవాల్​ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఓటు వేశానన్నారు. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటు వేశానని కేజ్రీవాల్​ పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగా లేదన్నారు. ఓటు వేసిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. 

సీఎం కేజ్రీవాల్​ షేర్​ చేసిన ఫోటోపై స్పందించిన పాక్​ మాజీ మంత్రి చౌదరి ఫవాద్​ హుస్సేన్​ ట్వీట్​ లో స్పందిస్తూ శాంతి, సామరస్యం ద్వేషం, తీవ్రవాద శక్తులను ఓడిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే కేజ్రీవాల్​ స్పందించారు. తమ దేశ సమస్యలను తాము పూర్తిగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. ఇందుకోసం మీరు ట్వీట్​ చేయనవసరం లేదన్నారు. ప్రస్తుతం పాక్​ లో అత్యంత ఘోరమైన పరిస్థితులున్నాయన్నారు. వాటిని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించాలని ఫవాద్​ కు చురకలంటించారు. తీవ్రవాదం ఏ దేశానికైనా ప్రమాదకరమేనన్నారు. ప్రస్తుతం పాక్​ లో పరిస్థితులు ఆదర్శంగా ఏం లేవని విమర్శించారు.