ఆర్టికల్ 370 పునరుద్ధరణకు అసెంబ్లీ ఆమోదం
Assembly approves Article 370 renewal
ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు
గురువారానికి సభ వాయిదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 370 ఆర్టికల్ పునరుద్ధరణ ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదించింది. ఈ ప్రతిపాదనపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య ఆర్టికల్ 370కి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆమోదించిన పత్రాల కాపీలను చించివేశారు. అసెంబ్లీ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ బయట రాష్ర్టంలోని పలు బీజేపీ కార్యాలయాల వద్ద సీఎం ఒమర్ అబ్దుల్లా దిష్ఠిబొమ్మను దహనం చేశారు. నిరసనలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ మంత్రుల సమావేశాన్ని పిలిచి తీర్మానం ముసాయిదాను స్వయంగా తయారు చేశారని ఆరోపించారు. గందరగోళం నెలకొనడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్మూకశ్మీర్ ప్రజలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. ఆర్టికల్ 370, 35ఎలను ఏ అసెంబ్లీకి తీసుకువచ్చే అధికారం లేదని బీజేపీ పేర్కొంది.