పర్యావరణ సవాళ్లకు పరిష్కారం

Solving environmental challenges

Sep 11, 2024 - 16:58
 0
పర్యావరణ సవాళ్లకు పరిష్కారం
సెమీ కండక్టర్​ పరిశ్రమ విస్తరణ
క్రియాత్మక ఆలోచనలతో ముందుకు
సత్తాచాటేందుకు భారత్​ సిద్ధం
సెమికాన్​ ఇండియా 2024లో ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్​ పరిశ్రమ విస్తరణ ద్వారా పర్యావరణ వ్యవస్థలోని సవాళ్లకు కూడా ఒక చక్కటి పరిష్కారం లభించే దిశగా భారత్​ కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంక్షోభ సమయాల్లో కూడా క్రియాత్మక ఆలోచనలతో ముందుకు వెళుతూ సత్తా చాటడం భారత్​ నిబద్ధతను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. 
 
బుధవారం ఉత్తరప్రదేశ్​ లోని గ్రేటర్​ నోయిడా ఇండియా ఎక్స్​ పో మార్ట్​ లో సెమికాన్​ ఇండియా 2024ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెప్టెంబర్​ 11 నుంచి 3 వరకు జరిగే మూడు రోజుల సదస్సు జరగనుంది. సెమీ కండక్టర్​ తయారీలో గ్లోబల్​ హబ్​ గా భారత్​ నిలవాలనే లక్ష్యాన్ని ఈ సదస్సులో ప్రదర్శించనుంది. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్​ సెక్టార్​ లో భారత్​ ఎనిమిదో అతిపెద్ద దేశంగా నిలుస్తుందన్నారు. 21వ శతాబ్ధంలో మరింత ఉత్పత్తిని సాధించేందుకు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. 
 
సెమీ కండక్టర్​ రంగం ప్రత్యేక డయోడ్​ లతో పనిచేస్తుందని శక్తి ద్విముఖంగా ఉంటుందన్నారు. ఈ పరిశ్రమల్లో పెట్టుబడులు స్థిరమైన విఆనం వల్ల మరింత పెరుగుతాయని తెలిపారు. మెరుగైన వ్యాపార సౌలభ్యం ఈ రంగంలో ఉందన్నారు. 
 
ఈ రంగంలో 20 శాతం భారతీయులు శ్రామికశక్తి ఉందని తెలిపారు. 85వేలమంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్​ అండ్​ బీ నిపుణులు సెమీకండక్టర్ల రూపకల్పనలో ప్రతిష్ఠాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 
ఈ పరిశ్రమ బలోపేతానికి నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ 1 ట్రిలియన్​ ప్రత్యేక నిధిని మంజూరు చేసిన విషయాన్ని ప్రధాని ఊటంకించారు. ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ఈ రంగంలో పర్యావరణానికి హానీ కలగని సెమీకండక్టర్ల రూపకల్పనే ధ్యేయమన్నారు. 
 
భారతీయుల ఆకాంక్షలు నెరవేరాలంటే దేశం బలమైన డిజిటల్​ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం సెమీకండక్టర్ల  తయారీకి ప్రాముఖ్యతనిస్తుందని మోదీ తెలిపారు.
 
ఈ రంగంలో సౌకర్యాల కల్పనకు 50 శాతం ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పరిశ్రమలకు అవసరమైన ఖణిజాలు, దేశీయ ఉత్పత్తి, విదేశీ సేకరణ పెంచందుకు క్రిటికల్​ మినరల్​ మిషన్​ ను కూడా ప్రారంస్తామని మోదీ ప్రకటించారు. 
 
ఇండో–పసిఫిక్​ ఎకనామిక్​ ఫ్రేమ్‌వర్క్ సప్లై చైన్  కౌన్సిల్​ కు వైస్​ చైర్​ పర్స్​ గా భారతీయుల నియామకం గర్వకారణమన్నారు. జపాన్​, సింగపూర్​ లాంటి దేశాలతో ఈ రంగంపై మరింత పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
 
ఇప్పటికే అతిపెద్ద మొబైల్​ ఎగుమతిదారుడిగా భారత్​ మారేందుకు అనేక విధానాలను సరళకృతం చేస్తూ నిర్ణయించామన్నారు. దీనివల్ల 230నాటికి 500 బిలియన్లకు ఎలక్ట్రానిక్స్ రంగాన్ని విస్తరించే ప్రణాళికలున్నాయని ప్రకటించారు. దీని ద్వారా ఆరు మిలియన్​ ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. 
 
ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, గ్లోబల్ సెమీకండక్టర్ కంపెనీల వ్యవస్థాపకులు, 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు తదితరులు పాల్గొన్నారు.