తైవాన్ చుట్టూ చైనా విమానాలు, నౌకల మోహరింపు
Deployment of Chinese planes and ships around Taiwan
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తైవాన్ ను చైనా పూర్తిగా చుట్టుముట్టింది. 62 విమానాలు, 27యుద్ద నౌకలను నాలుగు వైపుల నుంచి మోహరించింది. శనివారం ఉదయం వరకు తైవాన్ జలసంధి నైరుతి, ఆగ్రేయ, తూర్పు ప్రాంతాలలో ఎయిర్ డిఫెన్స్ లను మోహరించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. చైనా తైవాన్‌ను తన భాగంగా పేర్కొంటోంది. మరోవైపు తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ విషయంపై పలుమార్లు అంతర్జాతీయ సమాజం కూడా చైనాతో విబేధించింది. అయినా చైనా తన చర్యలను కొనసాగిస్తూ వస్తోంది. తైవాన్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తోంది. కాగా తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు, నౌకలు మోహరించడాన్ని యూఎస్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. రెండు రోజుల క్రితం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ద్వారా సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. ఈ పరిణామాలను అంతర్జాతీయ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల యుద్ధం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నాయని పేర్కొంటున్నాయి.