రాహుల్ కు నలభైయ్యే!
రామ మందిరానికి ఎందుకు రాలేదని ప్రశ్నించండి ఐదో దశలోనే 310 ఖాయం అనురాగ్ వంటి మంచి నాయకులు దీపం పెట్టి వెతికినా దొరకరు పీవోకే స్వాధీనం పక్కా హమీర్ పూర్ ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్ షా
షిమ్లా: రాహుల్ బాబా అండ్ పార్టీకి 40 పరిమితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్, ప్రియాంకలు రామ మందిరానికి ఎందుకు రాలేదని ఈసారి షిమ్లాకు వారు వస్తే ప్రశ్నించాలన్నారు. ఐదు దశల్లోనే మోదీ టీమ్ కు 310 సీట్లు ఖాయమన్నారు. బీజేపీ చెప్పినట్లుగానే 400 మార్క్ సీట్లు సాధిస్తుందన్నారు.
శనివారం హిమాచల్ లని హమీర్ పూర్ లో అనురాగ్ ఠాకూర్ కు మద్ధతుగా ఎన్నికల ప్రచార సభలో షా ప్రసంగించారు. ఠాకూర్ లాంటి మంచి నాయకులు దీపం దీపం పెట్టి వెతికినా దొరకరన్నారు. నిరంతరం ఆయన తన ప్రాంత అభివృద్ధికి తపన పడుతుంటారన్నారు. ఎళ్లవేళలా నిరుపేదల పట్ల సహృదయంతో ఉంటారని తెలిపారు. ఠాకూర్ ను ఎన్నుకొని ఈ ప్రాంత మరింత అభివృద్ధికి బీజం వేయాలని అమిత్ షా పేర్కొన్నారు. అమీర్ పూర్ లో ఏడో దశలో పోలింగ్ జరగనుంది.
పీవోకే భారత్ కే చెందుతుందని షా పునరుద్ఘాటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీవోకే స్వాధీనం చేసుకుంటామన్నారు. దేశ కీర్తి, ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తుంటే మరోవైపేమో ఈ తుచ్ఛ పార్టీలు దేశ పేరు,ప్రఖ్యాతులను మంటగలిపేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తి కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు దేశాన్ని అడ్డాగా మార్చి కూర్చున్నాయన్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛ నీయకుండా వారిని అడ్డుకొని అనేకమంది మృతికి కారకులయ్యారని కాంగ్రెస్ పై అమిత్ షా మండిపడ్డారు. మోదీ నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు.