న్యాయమూర్తికి ఘన స్వాగతం
సమస్యల ఏకరవు పరిష్కారానికి జడ్జి హామీ
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: జిల్లా పోర్టు ఫోలియో న్యాయమూర్తి డా. రాధారాణి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, భవాని చంద్రలకు శనివారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో కార్యవర్గం స్వాగతం పలికి ఘనంగా సత్కరించింది. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని పోర్ట్ ఫోలియో జడ్జి హామీ ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ లోని గ్రంథాలయానికి న్యాయమూర్తి విచ్చేసి తమ సందర్శనను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, అంబరీష్ మహిళా ప్రతినిధి లలిత, లైబ్రరీ సెక్రటరీ ఆంజనేయులు, సభ్యులు జ్ఞానోబా, విజయ్, వినోద్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.