భారత్​–శ్రీలంక బంధాలు మరింత బలోపేతం

India-Sri Lanka ties become stronger

Dec 16, 2024 - 16:10
 0
భారత్​–శ్రీలంక బంధాలు మరింత బలోపేతం

అధ్యక్షుడు దిసనాయకేకు ప్రధాని మోదీ ఘన స్వాగతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–శ్రీలంక సంబంధాలు కొత్త శక్తిని సృష్టించాలని, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 15 నుంచి 17 వరకు శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్​ దిసనాయకే భారత పర్యటనలో ఉన్నారు. సోమవారం ఉదయం మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలు అంశాలపై చర్చించారు. దిసనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్​ కు తొలి పర్యటన. అనంతరం ప్రధానమంత్రి, అధ్యక్షుడితో కలిసి ఇరుదేశాల బంధాలపై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. 
ఇరుదేశాల ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడికి దారితీసే వృద్ధి, కనెక్టివిటీ, డిజిటల్, భౌతిక, శక్తి, విద్యుత్ గ్రిడ్, బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్ ల ఏర్పాటుపై దృష్టి సారించనున్నామన్నారు. ఇరు దేశాలు సోలార్ పవర్ ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 

చర్చల ముఖ్యాంశాలు..
– భారత్​ శ్రీలంకలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ పవర్​ ప్లాంటు ప్రాజెక్టుల కోసం ఎల్​ ఎన్​ జీ సరఫరా చేయడం. 
– 5 బిలియన్​ డాలర్ల క్రెడిట్​ గ్రాంట్​ లను భారత్​ ఇప్పటివరకు శ్రీలంకకు అందజేసింది. 
– శ్రీలంకలోని 25 జిల్లాల్లో భారత్​ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం.
– అనురాధాపురం, కాంకే సాథూరాయిపోర్ట్​ లకు ఆర్థిక సహాయం.
– జాఫ్నాలోని విశ్వవిద్యాలయంలో 200మంది శ్రీలంక జాతీయులకు ఉద్యోగాలు. ఈ విశ్వవిద్యాలయాన్ని భారత–శ్రీలంకు సంయుక్తం నిధులతో నిర్వహిస్తున్నాయి. 
– యూనిక్​ ఐడెంటిటీ డిజిటల్​ ప్రాజెక్టులో భారత్​ సహకారం.
– హౌసింగ్​ రిన్యూవబుల్​ ఎనర్జీ డెయిరీ, ఫిషరీస్​ అభివద్ధికి భారత్ సహకారం.
– మారిటైమ్​ సెక్యూరిటీ, కౌంటర్​ టెర్రరిజం, సైబర్​ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల సరఫరా, ఆర్గనైజ్డ్​ క్రైయిమ్​ లపై ఇరుదేశాల సహకారం.
– చెన్నై జాఫ్​నా విమానాల సర్వీసులతో పర్యాటక రంగానికి ఊతం.
ఆయా విషయాలపై పూర్తిస్థాయిలో చర్చలు జరిగి ఇరుదేశాలు ఒక నిర్ణయానికి రావాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి.