సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ
సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం టీఎంసీ పిటిషన్ పై విచారణ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ అని ఆ సంస్థ తమ కంట్రోల్ లో ఉండదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టింది. రాష్ర్టంలో సీబీఐ విచారణ చేసేటప్పుడు రాష్ర్ట ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు రోజుల కిందట సీబీఐ, ఎస్పీజీ, బాంబు స్క్వాడ్ లు జరిపిన దాడుల్లో టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ సన్నిహిత వ్యక్తి ఇంట్లో ఆయుధాలు, బాంబులు లభించిన విషయం తెలిసిందే. ఈ దాడులను వ్యతిరేకిస్తూ టీఎంసీ ప్రభుత్వం పిటిషన్ ను దాఖలు చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి రాజ్యాంగంలోని 131వ అధికరణం రాజ్యాంగంలోని అత్యంత పవిత్రమైన అధికార పరిధి అని, అందులోని నిబంధనలు ఉండవని తెలిపారు.
సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కాగా 2018లో సీబీఐని తమ రాష్ర్టంలోకి రానీయబోమని మమత సర్కార్ అనుమతించని విషయం తెలిసిందే.