ముస్లింలందరికీ అమెరికా, ఇజ్రాయెల్ లు శత్రువులే
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
టెహ్రాన్: ముస్లింలందరికీ అమెరికా, ఇజ్రాయెల్ లు శత్రవులేనని, కీలక సమయంలో ముస్లిందేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ విజ్ఞప్తి చేశారు.. శుక్రవారం టెహ్రాన్ లో ప్రార్థనలలో ప్రసంగిస్తూ శత్రువుల దాడులు, ప్రణాళికలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇరాన్, ఇరాక్, లెబనాన్, ఈజిప్టు మనందరికీ ఒకే శత్రువులన్నారు. విప్లవం కవాతుపై దాడులకు పాల్పడుతూ విప్లవాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ పవిద్ర యుద్ధంలో ఎందరో సమిధలయ్యారని తెలిపారు. యోధుల బలిదానాలు ఎన్నటికీ మరువరాదన్నారు. ముస్లింలందరూ కలిసి మెలిసి ఒక్కటిగా జీవించాలని ఖమేనీ పిలుపునిచ్చారు.