కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే
సమస్యలు పరిష్కరిస్తానని హామీ
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సదాశివపేట డిగ్రీ కళాశాలను బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు. కళాశాలలోని సదుపాయాలపై ఆరా తీశారు. కాలేజీలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నూతన బాలికల హాస్టల్ భవనం, బాలికల ప్రత్యేక విశ్రాంతి గదులు , కాంపౌండ్ వాల్, ఆర్ వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన చింత ప్రభాకర్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాను సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సదాశివపేట డిగ్రీ కళాశాల సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళాశాలను సందర్శించి వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. సదాశివపేట డిగ్రీ కళాశాలకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.