పక్క దారి పట్టిన అంగన్ వాడీ సరుకులు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్థులు టీచర్ ను తొలగించాలని డిమాండ్
నా తెలంగాణ, అందోల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని హాసన్ మహమ్మద్ పల్లి తండాలో అంగన్ వాడీ సరుకులు పక్కదారి పట్టాయి. తండాకు చెందిన చెందిన అంగన్ వాడీ టీచర్ దేవసోత్ అనసూయ తన అల్లుని కారులో గర్భీణీలకు, చిన్న పిల్లలకు అందించే గుడ్లు, పాల పదార్థాలు, కందిపప్పును తరలిస్తుండగా తండావాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రతీ నెలా ఈ సరుకులన్నీ అంగన్ వాడీలోని పిల్లలకు అందజేయాల్సి ఉండగా ఆమె తన బంధువులకు తరలిస్తు, బయటి ప్రాంతాల్లో అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటోందని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే అంగన్ వాడీ ఆయా అనసూయపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.