ప్రకృతికే అందం- బతుకమ్మ సంబురం
ఎస్పీ డా. జి.జానకి షర్మిల
నా తెలంగాణ, నిర్మల్: బతుకమ్మ సంబరాలు ప్రకృతికి అందాన్నిస్తాయని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. భరోసా కార్యాలయ ప్రాంగణంలో బుధవారం జిల్లా పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ బతుకమ్మకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్, జిల్లా ట్రెజరీ అధికారి సరోజినీ, డిఎస్పీ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.