మహారాష్ట్రలో బస్సు ప్రమాదం 15మంది మృతి, 20మందికి తీవ్ర గాయాలు

Bus-accident-in-Maharashtra-kills-15-and-seriously-injures-20

Nov 29, 2024 - 15:29
Nov 29, 2024 - 18:35
 0
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం 15మంది మృతి, 20మందికి తీవ్ర గాయాలు

ముంబాయి: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల సమాచారం ప్రకారం మహారాష్​ర్ట స్టేట్​ ట్రాన్స్​ పోర్ట్​ కార్పొరేషన్​ కి చెందిన శివషాహి బస్సు భండారా నుంచి గోడిన్యాకు వెళుతుంది. గోడిన్యాకు 30 కిలోమీటర్ల దూరంలో ఖజ్రీ అనే గ్రామ సమీపంలో వేగం వల్ల బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సనందజేస్తున్నారు. తాత్కాలిక సీఎం ఏక్​ నాథ్​ షిండే ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.