ఎన్టీఏ పారదర్శకత ఏడుగురు సభ్యుల కమిటీ నియామకం
Appointment of seven-member NTA Transparency Committee
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు, పూర్తి పారదర్శకతతో కూడిన ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. శనివారం ఈ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించింది. డాక్టర్ కె రాధాకృష్ణన్, చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్, డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ బి.జె. రావు, వీసీ-సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ రామమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్-ఐఐటీ మద్రాస్, పంకజ్ బన్సాల్, సహ వ్యవస్థాపకుడు, పీపుల్ స్ట్రాంగ్ సభ్యుడు-కర్మయోగి భారత్,ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, విద్యార్థి వ్యవహారాల డీన్-ఐఐటీ ఢిల్లీ, గోవింద్ జైస్వాల్, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిలను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.