ఖలిస్థానీ ఆర్థిక మూలాలపై బ్రిటన్​ చర్యలు బ్యాంకు అకౌంట్లు సీజ్​

 భారత విద్రోహ శక్తులు ఖలిస్థానీ సమర్థక గ్రూపులపై బ్రిటన్​ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.

Mar 9, 2024 - 20:00
 0
ఖలిస్థానీ ఆర్థిక మూలాలపై బ్రిటన్​ చర్యలు  బ్యాంకు అకౌంట్లు సీజ్​

నా తెలంగాణ, ఢిల్లీ:  భారత విద్రోహ శక్తులు ఖలిస్థానీ సమర్థక గ్రూపులపై బ్రిటన్​ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఖలిస్థానీ సమర్థక గ్రూపులకు సంబంధించి 300 బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు బ్రిటన్​ పోలీసు వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ఈ అకౌంట్లలో ఉన్న లక్షల కోట్ల రూపాయలను జప్తు చేశామని బ్రిటన్​ పోలీసులు పేర్కొన్నారు. ఈ అకౌంట్​లు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​నుంచి జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలను గుర్తించామని ప్రకటించారు. సిక్​ఫర్​ జస్టిస్​ అకౌంట్లో రూ. 20 కోట్లను సీజ్​ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా భారత నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఖలిస్థానీ గ్రూపులు చేస్తున్న కుట్రలను భగ్నం చేసేందుకు ఆయా దేశాల రక్షణ, పోలీసు వర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్​లో అనుమానాస్పద లావాదేవీలపై చర్యలు సాధ్యపడ్డాయి. మరోవైపు అమెరికాలో ఖలిస్థాన్​ సమర్థక గ్రూపులు చేస్తున్న అక్రమ లావాదేవీలపై అమెరికా నిఘా ఏజెన్సీ ఎఫ్​బీఐతో కూడా భారత ఇంటెలిజెన్స్​ పలు విషయాలను పంచుకుంటోంది. వచ్చేనెల భారత బృందం అమెరికా వెళ్లి ఎఫ్​బీఐకి అక్రమ లావాదేవీలకు కారణమైన వివరాలను కూడా అందించనున్నట్లు ఇంటలిజెన్స్​ అధికారులు వివరించారు. బ్యాంకు అకౌంట్ల ద్వారా నగదు సీజ్​ చేస్తే హవాలా రూపంలో కూడా అక్రమ లావాదేవీల కార్యకలాపాలు కొనసాగవచ్చని ఆ దిశలో కూడా ఇంటెలిజెన్స్​ నిఘా పెట్టినట్లు తెలిపారు.
మరోవైపు ఖలిస్థానీ నాయకుడు అమృత్​పాల్​సింగ్​ శిక్ష అనుభవిస్తున్న డిబ్రూగఢ్​జైలులో సెల్​ఫోన్, బ్లూటూత్, స్పై కెమెరాలు లభించడంతో జైలు అధికారులపై సస్పెన్షన్​ విధించడం తెలిసిందే.