పాక్ లో భూకంపం 15 మంది మృతి
200మందికి గాయాలు, పలు భవనాలకు నష్టం
ఇస్లామాబాద్: పాక్ లో భారీ భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో బుధవారం వచ్చిన ఈ భూకంపంలో 15మంది ప్రాణాలు కోల్పోగా 200మంది వరకు గాయపడ్డారు. భూకంపం కేంద్రం అఫ్ఘానిస్థాన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో 98 కి.మీ. లోతున కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. కాగా భూకంపం వల్ల ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, స్వాత్, మలకంద్, నార్త్ వజ్రిస్థాన్, పారాచినార్, లోయర్ దిర్, హంగు, చార్‌సడ్డా, స్వాబి ప్రాంతాలలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. లకు విస్తరించాయని నేషనల్ సిస్మెక్ మోనిటరింగ్ సెంటర్ వెల్లడించింది. పలుచోట్ల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.