బడ్జెట్​ తో అన్ని వర్గాల అభ్యున్నతి

అద్భుతాలను సృష్టించే బడ్జెట్​ దీర్ఘకాలిక బడ్జెట్​ తోనే ఆర్థిక వృద్ధి పటిష్ఠం కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​

Jul 28, 2024 - 19:02
 0
బడ్జెట్​ తో అన్ని వర్గాల అభ్యున్నతి

ముంబై: పేదలు, రైతులు, యువత, మహిళలు అన్ని వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ లో ప్రాధాన్యమిచ్చిందని కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2024 బడ్జెట్​ అద్భుతాలను సృష్టించే విధంగా ఉందని తెలిపారు. 

140 కోట్ల మందికి బడ్జెట్​ తో మేలు చేకూరనుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని, 4 కోట్ల మంది యువత భవిష్యత్తుకు సిద్ధమవుతారని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఉపాధిలో సహాయపడుతుందని, వ్యాపారం చేయడం సౌలభ్యం పెరుగుతుందన్నారు. 

ఎంస్​ ఎంఈలు, స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహాం లభిస్తుందన్నారు. దీర్ఘకాలిక విజన్ ప్లాన్ గురించి మంత్రి మాట్లాడుతూ.. ప్రజాకర్షక బడ్జెట్ స్వల్పకాలానికి లాభదాయకంగా కనిపించొచ్చేమో గనీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే దీర్ఘకాల ప్రయోజనాల బడ్జెట్​ ను ప్రవేశపెట్టామన్నారు. ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువ్తుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్​ లో అన్ని రాష్ట్రాలకు సమప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ప్రతి రాష్ర్టంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనున్నామని పీయూష్​ గోయల్​ స్పష్టం చేశారు.