30 విమానాలకు బాంబు బెదిరింపులు!

Bomb threats to 30 planes!

Oct 19, 2024 - 18:25
 0
30 విమానాలకు బాంబు బెదిరింపులు!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శనివారం భారీ ఎత్తున దేశ, అంతర్జాతీయవ్యాప్తంగా నడుస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం కేవలం ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు రాగా రాత్రి వరకు 30 విమానాలకు పైగా బాంబు బెదిరింపుల సమాచారం అందడంలో విమానాశ్రయ, భద్రతా, ప్రభుత్వాలలో గందరగోళం నెలకొంది. ఈ బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన నియమ, నిబంధనలను రూపొందించేందుకు సిద్ధమవుతుండగా మరిన్ని బెదిరింపులు ఎక్కువ కావడం గమనార్హం.  శనివారం విస్తారా, ఎయిర్​ ఇండియా, ఇండిగో, ఆకాస ఎయిర్​, స్పైస్​ జెట్​, స్టార్​ ఎయిర్​, అలయన్స్​ ఎయిర్​ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అన్ని బెదిరింపులు  ఉత్తివే అని తేలాయి. 
 
విస్తరా–5, ముంబై–ఇస్తాంబుల్​, ఢిల్లీ–ఇస్తాంబుల్​, జోధ్​ పూర్​–ఢిల్లీ, హైదరాబాద్​ – చండీగఢ్​, ముంబై–ఢిల్లీ ఇలా అనేక విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 
 
గత ఐదు రోజుల్లో 90 విమానాలకు పైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొంది. రానున్న పర్వదినం దీపావళి సందర్భంగా వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రయాణికులు భారీ ఎత్తున సమయం కలిసివచ్చేందుకు విమానాలలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారడంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. నేడో రేపో బెదిరింపులపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.