జమ్మూకశ్మీర్​ రాష్ట్ర హోదాకు ఎల్జీ ఆమోదం

రెండు రోజుల్లో ప్రధాని మోదీని కలవనున్న సీఎం ఒమర్​

Oct 19, 2024 - 18:11
 0
జమ్మూకశ్మీర్​ రాష్ట్ర హోదాకు ఎల్జీ ఆమోదం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్​ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన ప్రతిపాదనను శనివారం లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హాకు సమర్పించారు. ఎల్జీ ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. డిప్యూటీ సీఎం సురీందర్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, ఇక కేంద్రం తన హామీని నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తమ హక్కు, డిమాండ్‌కు సంబంధించిన అంశమని ఒమర్‌ అబ్దుల్లా రెండు రోజుల్లో ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారని తెలిపారు. 

రాష్ట్ర హోదా పునరుద్ధరణ సంస్కరణ ప్రక్రియకు నాంది అవుతుందని, ఇది రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తుందని, జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపును కాపాడుతుందని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రభుత్వంతో ఈ విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రికి క్యాబినెట్ అధికారం ఇచ్చిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలిపారు.