ప్యారిస్​–ముంబై విమానానికి బాంబు బెదిరింపు

ఉత్తదేనని తేల్చిన అధికారులు విదేశాల నుంచే వరుస బెదిరింపులు

Jun 2, 2024 - 14:55
 0
ప్యారిస్​–ముంబై విమానానికి బాంబు బెదిరింపు

ముంబై: ప్యారిస్​ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అలర్ట్​ అయిన ముంబై ఏయిర్​ పోర్ట్​ అధికారులు హై అలర్ట్​ విధించారు. ఆదివారం ఉదయం విమానం ఉదయం పదిగంటలకు యూకె–024 విమానం ల్యాండ్​ అయ్యింది. వెంటనే 12 మంది సిబ్బంది 294 మంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దింపారు. విమానాన్ని ఐసోలేషన్​ లోకి తరలించి బాంబు స్క్వాడ్​ తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధరించారు. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బాంబు బెదిరింపు ఐదవదని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అన్ని బెదిరింపు కాల్స్​ విదేశాల నుంచి వస్తున్నట్లు గుర్తించారు.