బీఎస్పీకి షాకే? ఒంటరిపోరుతో చతికిలపడ్డ మాయావతి
Shock to BSP? Mayawati squatted with a single fight
లక్నో: యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారా? అంటే ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే అవుననే వాదన వినిపిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగింది. 2019లో యూపీలో 10 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఎస్పీ పార్టీకి ఈసారి నిరాశే ఎదురు కానుంది.యూపీలో బీజేపీయే మెజార్టీ స్థానాలను దక్కించుకోనుండగా, మిగతా అరకొర స్థానాలను ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ) దక్కించుకోనుంది. ఒంటిరిపోరు నిర్ణయమే మాయావతికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ సత్తా చాటలేక కేవలం ఒక్క సీటును సాధించి పరువు నిలబెట్టుకుంది. చతికిలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఎంపీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని మాయావతి సింగిల్ గానే పోటీలోకి దిగారు. అయితే ఆమె భావించినట్లుగా దళితులు, ముస్లిం వర్గాలు ఓట్లు ఆమెకు ఆశించిన స్థాయిలో పడనట్లు ఎగ్జిట్ పోల్ వివరాలు చూస్తే అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఫలితాలను వెల్లడించే వరకు మాయావతి (బీఎస్పీ) భవితవ్యం ఏంటన్నది తేలనుంది.