పారిస్​ మూడు రైల్వే లైన్లపై దాడులు

ఫ్రాన్స్​ లో హై అలర్ట్​

Jul 26, 2024 - 14:43
 0
పారిస్​ మూడు రైల్వే లైన్లపై దాడులు

రైల్వే స్టేషన్​ లలో 8లక్షల మంది ప్రయాణికుల పడిగాపులు
ఖండించిన రవాణా శాఖ మంత్రి ప్యాట్రిస్​
దుండగుల కోసం వేట ముమ్మరం
సెయిన్​ నదిపై ఒలింపిక్​ క్రీడోత్సవాలపై కమ్ముకున్న నీలినీడలు


పారిస్​: ఒలింపిక్స్​ క్రీడలకు ముందు శుక్రవారం ఫ్​రాన్స్​ లో కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు రైల్వే లైన్​ లపై నిప్పు పెట్టారు. ఫ్రాన్స్​ లోని అర్రాస్​, కోర్ట్​ లేన్​, మరో రైల్వే లైన్​ పై దుండగులు నిప్పు పెట్టారు, కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. 

ఈ హఠాత్​ పరిణామంతో ఫ్​రాన్స్​ లో హై అలెర్ట్​ విధించారు. చాలా స్టేషన్​ లలో రైళ్లను నిలిపివేశారు. పలు రైళ్లను దారి మళ్లించగా, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో  సుమారు ఎనిమిది లక్షల మంది రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. అయితే ఈ దాడికి ఏ సంస్థ ఇంతవరకు బాధ్యత ప్రకటించలేదు. నిందితులెవ్వరన్నది ఫ్రాన్స్​ ప్రభుత్వం ప్రకటించలేదు. 

ఫ్రెంచ్​ రవాణా మంత్రి ప్యాట్రిస్​ వెర్గరైట్​ దాడిని తీవ్రంగా ఖండించారు. రక్షణ, పోలీసు, నిఘా వర్గాలు నిందితుల వేట కొనసాగిస్తున్నాయన్నారు. ఎంతమంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనేది త్వరలోనే తేలుస్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 

పారిస్​ లోని సెయిన్​ నదిపై ఒలింపిక్స్​ క్రీడల ప్రారంభ ఉత్సవాలు శుక్రవారం రాత్రి నిర్వహించనున్నారు. ఈ లూపే దాడి జరగడం పట్ల సెయిన్​ నది పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా నిఘా వర్గాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు క్రీడోత్సవాల నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.