జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీగా కిషన్ రెడ్డి
వివిధ రాష్ట్రాల ఎన్నికల ఇన్ చార్జీల నియామకం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం వివిధ రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించింది. దీంతోపాటు పంజాబ్, పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కో-ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను నియమించినట్లు పార్టీ తెలిపింది. దీంతో పాటు హరియాణా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో-ఇన్‌చార్జ్‌గా ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్‌ను నియమించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఝార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పార్టీ నియమించింది. ఆయనతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు.