కుప్వారాలో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in encounter in Kupwara
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలోని కేరాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. గురువారం ఉగ్రవాదులు దాక్కున్నట్లు సైన్యానికి సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.