ముస్లిం జనాభా పెరుగుదలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన
CM Himanta Biswa Sharma is worried about the increase in Muslim population
డిస్ఫూర్: అసోంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై ఆ రాష్ర్ట సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోందన్నారు. 1951లో 12 శాంగా ఉన్న వారి జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరుకుందన్నారు. ఇది తమకు రాజకీయ సమస్య కాదని జీవన్మరణ సమస్య అని అన్నారు. ఇప్పటికే ఈ పరిణామం వల్ల తాము చాలా జిల్లాలను కోల్పోయామని శర్మ తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకొని అసోం ఉండడంతో ఇక్కడి నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం చట్టం ప్రకారం పలు షరతులు విధిస్తామని శర్మ తెలిపారు. ఈ కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే వారు తప్పక కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బహుభార్యత్వం, బాల్యవివాహాలు, ఇద్దరు పిల్లలు లాంటి నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.