నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల కంది సంగారెడ్డిలో ఆదివారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన పురస్కరించుకుని ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా. రఘురామిరెడ్డి, డా. సదాశివరావు, రిజిస్టర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి డాక్టర్ కే. సదాశివరావు, డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరిం,గ్ డాక్టర్ కల్పన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీరితోపాటు ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఈక్విటివ్ ఇంజనీరింగ్ ( ఇరిగేషన్ అండ్ జిఏడి) డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 78 మంది కళాశాల పూర్వ విద్యార్థులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్. జి. మనోజ్ కుమార్ అసోసియేట్ డీన్ ప్రారంభించి ప్రసంగించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల నుంచి ఎంపికైనటువంటి పూర్వ విద్యార్థులను అభినందించి సన్మానించారు.
డాక్టర్ పి. రఘురామిరెడ్డి రిజిస్టర్, మాట్లాడుతూ రైతు అభివృద్ధికి వ్యవసాయ ఇంజనీరింగ్ పాత్రను వివరిస్తూ, వ్యవసాయ ఇంజనీరింగ్ లో భాగమైనటువంటి కృత్రిమ మెద, డ్రోన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ ను ఉపయోగించి కొనాలన్నారు. యువత సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో డీఏవో డాక్టర్ డి. వ్యాయనాథ్, మాజీ డీన్ సదాశివరావు మాట్లాడారు. 2011 నుంచి 2018 సంవత్సరాల మధ్య కాలంలో చదివిన మాజీ విద్యార్థులను అభినందించారు. ఇక్కడి విద్యార్థులు ఉన్నతస్థానాల్లో స్థిరపడడం సంతోషకరమన్నారు. మాజీ విద్యార్థులంతా కళాశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మాజీ డీన్ డాక్టర్ కె. సదాశివరావు అసోసియేట్ డీన్ జి. మనోజ్ కుమార్ ను సన్మానించారు. అదేవిధంగా ఇటీవల ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా అసోసియేట్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, అనుబంధ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.