అనారోగ్యానికి గురైన విద్యార్థులు
పరామర్శించిన బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు
నా తెలంగాణ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కస్తూర్బా పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి భాష విద్యార్థులను పరామర్శించారు. వారికి పండ్లు, జ్యూస్‌లను అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అనారోగ్యానికి కారణం అయిన వారిపై చర్యలు సాయి భాష డిమాండ్ చేశారు. అధైర్యపడొద్దని విద్యార్థులకు, విద్యార్థుల తల్లి తండ్రులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రి నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కు ఫోన్ చేసి విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించింది. జిల్లా విద్యాధికారి హాస్టళ్లను తనిఖీలు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శలో ఆశిష్, శ్యామ్ వెంకట్ చారి, రాకేష్, సుమన్, ప్రతాప్ గౌడ్ చేస్తున్నారు.